పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

79చూసినవారు
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పెండింగ్లో ఉన్న కేసులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. శుక్రవారం గద్వాల నియోజకవర్గంలోని ధరూరు, కేటి దొడ్డి, గట్టు మండలాల్లోని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్లలో కేసుల నివేదికలను పరిశీలించిన ఆయన, పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.