గద్వాల్: చికిత్స పొందుతూ యువకుడు మృతి

70చూసినవారు
గద్వాల్: చికిత్స పొందుతూ యువకుడు మృతి
గద్వాల్ జిల్లా, పట్టణం చింతలపేటకు చెందిన నవీన్(25) అనే యువకుడు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూల్ కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా శుక్రవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్