జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చింతలపేటలో మొహర్రం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి పీర్లను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. త్యాగానికి ప్రతీక పీర్ల పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ముస్లింలు, హిందువులు కలిసి మెలిసి సోదర భావంతో పీర్ల పండుగ నిర్వహించుకుంటారని అన్నారు.