తెలంగాణ గాంధీ భవన్‌లో గురువారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను జడ్పీ మాజీ చైర్ పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ సరిత తిరుపతయ్య, గద్వాల మున్సిపల్ చైర్మన్ బి. యస్. కేశవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. వీరు మహేష్ కుమార్ గౌడ్‌కు శాలువా కప్పి, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరించి, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.