జోగుళాంబ గద్వాల్ జిల్లా ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయరాదు,
ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు అని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల శాంతి భద్రతలను పరిరక్షించేందుకు జిల్లా ఎస్పీ కొన్ని సూచనలతో హోలీ పండుగను సురక్షితంగా జరుపుకునేందుకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.