గద్వాల్: ఆరో రోజుకు చేరిన ఎస్ఎస్ఏ ఉద్యోగుల దీక్షలు

73చూసినవారు
గద్వాల్: ఆరో రోజుకు చేరిన ఎస్ఎస్ఏ ఉద్యోగుల దీక్షలు
సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆరవ రోజు ఆదివారం నిరవధిక సమ్మె కార్యక్రమానికి జోగులాంబ గద్వాల జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ మొదట ఐక్యంగా ఉండాలన్నారు. ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే ఖచ్చితంగా సఫలీకృతం అవుతారన్నారు. మా రాష్ట్ర సంఘం కు మీ యొక్క సమస్యలను తెలియజేసి మీ సమస్యలను పరిష్కారం అయ్యేవరకు జిల్లా, రాష్ట్ర శాఖ మీతో పాటు ఉంటుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్