వడ్డేపల్లి, జూలేకల్ గ్రామంలో నాలుగేళ్లు గడిచిన పల్లె దవాఖాన భవన నిర్మాణ పనులు పూర్తి కావడం లేదు. కొంతవరకు పనులు చేశాక గుత్తెదారు భవన నిర్మాణ పనులు ఆపేశారు. ప్రస్తుతం ప్రైవేటు గదిలో పల్లె దవాఖాన నిర్వహిస్తున్నారు. త్వరగా భవనం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జి ఆంజనేయులు, జి వెంకటేష్ యాదవ్, తదితరులున్నారు.