గద్వాల జిల్లా కేంద్రంలోని కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్బంగా కృష్ణానది అగ్రహారంలో పూర్ణకుంభతో గంగాహారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మున్సిపల్ చైర్మన్ దంపతులు బి. యస్. కళావతి కేశవ్ లు హాజరయ్యారు. ముందుగా గంగానదికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి గంగానదిలో దీపాలు వదిలి మొక్కులు తీర్చుకొని, గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.