జోగులాంబ గద్వాల జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు బాసు హనుమంతు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం గట్టు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి అనుకూలమైన విధంగా పాలన నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.