జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని ఎల్కుర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఓపెన్ ఆల్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరితమ్మ, యువత స్నేహపూర్వకంగా క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.