గద్వాల మండల పరిధిలోని అన్ని ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్లలు, ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల ప్రభుత్వ సెలవు దినాలలో కచ్చితంగా పాఠశాలలు మూసివేయాలని మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.
దీనికి విరుద్ధంగా ప్రభుత్వ సెలవు దినాలలో పాఠశాల నిర్వహించిన వారిపై ఉన్నత అధికారుల ఆదేశానుసారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.