గద్వాల మండల పరిధిలోని బస్సాల్ చెరువు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. వారికి గ్రామ వాల్మీకి కుల బంధువులు బాణా సంచా కల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం సరితమ్మను మహిళలు, గ్రామస్థులు సన్మానించారు.