గట్టు మండల పరిధిలోని ఇందువాసి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 12 వార్డుల గ్రామ పంచాయతీలో 1914 మంది పురుషులు, 1841 మంది మహిళలు ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 3755. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, పలు రాజకీయ పార్టీల నాయకులు మరియు స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్ పదవిని గెలుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.