జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం గ్రామం దగ్గర 40 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఎనిమిది మంది మహిళా కూలీలకు గాయాలు. ఇద్దరు మహిళల పరిస్థితి విషమం. 108 ద్వారా గద్వాల్ హాస్పిటల్ కి తరలింపు. రాజోలి మండలం చిన్నదాన్వాడ గ్రామానికి చెందిన కూలీలు మంగళవారం ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామానికి కూలి పని నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.