మల్దకల్: సిఎమ్ఆర్ కాలేజీలో జరిగిన ఘటన దారుణం: తిరుమలేష్
మల్దకల్ మండల కేంద్రంలో పిడిఎస్‌యు నడిగడ్డ విద్యార్థి సంఘం గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలేష్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మేడ్చల్‌లోని సిఎమ్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీసిన దారుణ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేందర్ గౌడ్, మల్లికార్జున్, శ్రావణ్, తదితరులు కలరు.