శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుణ్యక్షేత్రంలో భక్తులు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు అమ్మవారికి పూజలు చేస్తూ, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వ్రత విశిష్టతను భక్తులకు వివరించడమే కాకుండా, భక్తులంతా అందంగా సజావుగా తమ పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన పూజారి తెలిపారు.