జోగులాంబ గద్వాల జిల్లా ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ పదవీ విరమణ తప్పదని, వారు చేసిన ఉత్తమ సేవల వల్లే గుర్తింపు వస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్. వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించి ప్రశంసించారు. ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.