ఉరేసుకొని వివాహిత మహిళ సూసైడ్

70చూసినవారు
ఉరేసుకొని వివాహిత మహిళ సూసైడ్
ఓ వివాహిత మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ భాస్కర్ కథనం ప్రకారం. అయిజలో బోయ పెద్ద రాముడు 13ఏళ్ల క్రితం మృతురాలిని వివాహం చేసుకున్నాడు. ఒక కుమార్తె ఉంది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురి కావడంతో కర్నూలు జిల్లా పెద్ద కడుమూరు చెందిన రాధను 2వ పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టాడు. కాగా భర్త లేని సమయంలో రాధ సూసైడ్ చేసుకుందని ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్