సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మిడ్జిల్ మండల కేంద్రంలో మహా నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి తెలిపారు. గురువారం మిడ్జిల్ మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి విగ్రహాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.