కల్వకుర్తి లో బీసీసబ్ ప్లాన్ సాధన కమిటీ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి ఉపాధ్యక్షులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ, భూమికోసం భుక్తి కోసం దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనితగా చాకలి ఐలమ్మ ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు.మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, రాజేందర్, దుర్గాప్రసాద్, శ్రీనివాసులు పాల్గొన్నారు.