ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా సబ్జెక్ట్ ఉపాధ్యాయులంతా కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ సూచించారు. గురువారం వెల్దండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యపై దృష్టి సారించి, ఉత్తమ ఫలితాలు పొందాలని డీఈఓ విద్యార్థులకు సూచించారు.