సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని సాగు చేస్తున్న ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా అమలు అవుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవిఎన్ రెడ్డి తెలిపారు. ఆదివారం వంగూరు మండలంలోని స్వగ్రామం కొండారెడ్డి పల్లి, గ్రామంలో స్థానిక మీడియాతో కెవిఎన్ రెడ్డి, మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతుందన్నారు.