నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని రఘుపతి పేట గ్రామానికి చెందిన వడ్డేమాన్ నాగమ్మ కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల మృతి చెందింది. ఈ విషయం గ్రామ పెద్దలు నార్ల కంటి రాజు ద్వారా తెలుసుకున్న ఆమనగల్ సాయిరాం మెడికల్ షాప్ వారు 3. 0000/-వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు హుస్సేన్, సర్కార్ బాలస్వామి, బుచ్చయ్య, ఆచారి, తదితరులు పాల్గొన్నారు.