నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలో తోటపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అమిరుద్దీన్ 100 సంవత్సరాల పైగా జీవించి, ఆరోగ్యంగా ఉన్నారు. జీవనోపాధికి ఆయన స్వయంగా ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన షాప్ నడిపించడమే కాకుండా తన సొంత పనులను ఆయనే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంగా ఉండటం పట్ల గ్రామస్థులు శనివారం హర్షం వ్యక్తం చేశారు.