తలకొండపల్లి మండలం వెల్జాలను మండల కేంద్రంగా ప్రకటించి, ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి గ్రామస్తులు, నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయనను కలిసి విన తిపత్రం అందజేసి మాట్లాడారు. గ్రామంలో ఆసుపత్రి, మండల కేంద్రం ఏర్పాటుతో 10 గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.