అసెంబ్లీ సమావేశాల్లో బి. ఆర్. యస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పై అసభ్యకర పద జాలంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మహిళా ఎమ్మెల్యేల పై విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం సాయంత్రం మహాబూబ్ నగర్ చౌరస్తా లో బిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యం, విజయ్ గౌడ్, సూర్య ప్రకాష్, డొక్కా లింగం తదితరులు పాల్గొన్నారు.