రైతులపై బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరి వీడాలి

380చూసినవారు
రైతులపై బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరి వీడాలి
గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా రైతులపై రుణమాఫీ అమలు చేస్తామని చెబుతున్న కల్వకుర్తి పట్టణంలోని బ్యాంకు అధికారులు మాత్రం రుణమాఫీ అమలులో తీవ్ర జాప్యం జరుపుతున్నారని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరిట రైతులు ఎస్ బి ఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర రోజు పడిగాపులు కాస్తూ లైన్లో నిల్చోలేక వృద్ధులు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ట్యాగ్స్ :