కొల్హాపూర్ నియోజకవర్గానికి చెందిన యువతీ, యువకులు ఎం ఎస్ ఆఫీస్, డేటా ఎంట్రీ కోర్సులలో ఉచిత శిక్షణ పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కూతురి ధర్మతేజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి మంత్రి జూపల్లి కృష్ణ రావు క్యాంప్ ఆఫీస్ వద్ద శిక్షణ తరగతులు ఉంటాయని, పదవ తరగతి చదివిన ఆసక్తి కలవారు దరఖాస్తులు పెట్టుకోవాలని తెలిపారు.