ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ ను దెబ్బతీసే రాజకీయ దురుద్దేశంతో కుట్ర పూరితంగా మాజీ మంత్రి హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని శనివారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన రత్నగిరి ప్రేరణ సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాట్లాడుతూ.. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వాటిపై చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.