సర్వే నెంబర్ 449లో సాగు భూమిని పేదలకు పంచాలి

53చూసినవారు
సర్వే నెంబర్ 449లో సాగు భూమిని పేదలకు పంచాలి
కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్ల వెల్లి మండల కేంద్రంలో ఉన్న సర్వే నెంబర్ 449లో ఉన్న 64 ఎకరాల 13 గుంటల సాగు భూమిని భూమి లేని నిరుపేదలకు పంచాలని మంగళవారం మధ్యాహ్నం ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆ భూమిని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు ఈశ్వర్ మాట్లాడుతూ భూమి లేని నిరుపేదలకు ఆ భూమిని పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్