కొల్లాపూర్ సమీపంలో నేషనల్ హైవే 167 రోడ్డులో బైక్ పై వెళుతున్న మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాసును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆయనకు కుడి చేయి ప్యాక్చరైంది. గమనించిన స్థానికులు రామదాసును ప్రభుత్వ స్థానిక దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. కాగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో మెరుగైన వైద్యం కోసం ఆయనను శుక్రవారం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు.