కొల్లాపూర్ మండలం నూతన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా భార్యల సత్యనారాయణ యాదవ్ను నియమిస్తున్నట్లు కొల్లాపూర్ ఇన్ ఛార్జ్ వాళ్ళం సుధాకర్ నాయుడు తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నూతనంగా నియమితులైన సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ అవకాశం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.