ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కృషిలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కొన్నింటిని పైలెట్ ప్రాజెక్టు గా తీసుకొని రూ. లక్షల్లో వెచ్చించి అన్ని వసతులతో సుందరంగా పునర్నిర్మించారు.