కొల్లాపూర్ నియోజకవర్గంలోని గిరిజన కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉద్ధం సింగ్ 83వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి బి. దాస్ మాట్లాడుతూ. 1919 ఏప్రిల్ 13 న పంజాబ్ లోని అమృత్ సర్ లో జలియన్ వాలాబాగ్లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సమావేశమైన భారతీయులు వేల సంఖ్యలో మరణించారని దురాగతానికి కారకులైన వ్యక్తులను చంపే దాకా నేను చావనని ఉద్ధం సింగ్ ప్రతిజ్ఞ చేశాడన్నారు.