నాగర్ కర్నూల్ లోని సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 21, 22 వార్డులలో సిసి రోడ్లను నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాగర్ కర్నూల్ లో సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. నేడు అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.