మునిమోక్షంలో సంగమేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం

52చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని మునిమోక్షం గ్రామంలో సంగమేశ్వర స్వామి పునఃప్రతిష్ట కార్యక్రమాలు శనివారం ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం గణపతి పూజ, పుణ్యహవాచనం, గోమాత పూజ, హోమా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జ్యోషి శ్రీధర్ శర్మ, శ్రీకాంత శర్మ ఈ పూజ కైంకార్యాలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్