ఉమ్మడి జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు

52చూసినవారు
ఉమ్మడి జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు
సోమవారం నుంచి మరో మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఈ సందర్భంలో ఉరుములు, మెరుపులతో పాటు 30-40 కేఎంపిహెచ్ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్