నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డి పల్లి గ్రామం (బొందల కుంట) కు చెందిన రైతు బొడ్రాయి అంజప్ప అకస్మాత్తుగా కొన్ని నెలల కిందట గుండెపోటుతో మరణించాడు. భార్య లలిత ఇద్దరు పిల్లలు వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న సుభిక్ష ఆగ్రీ ఫౌండేషన్ టీం ఆమెకు వ్యవసాయంతో పాటు తమ యొక్క కుటుంబాన్ని పోషించడానికి మరింత సపోర్టుగా ఉంటుందనే ఉద్దేశంతో శనివారం కుట్టు మిషన్, అలాగే చీరలు, ఇతర వస్తువులు అందించి అండగా నిలిచారు.