ఆత్మకూరు సమీపంలోని మల్లాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను చాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.