సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వాక్యాలను నిరసిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో 167 జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం డిప్యూటీ సీఎం వెంటనే మహిళ ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.