మహిళ ఎమ్మెల్యేల పట్ల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయనున్నట్లు పార్టీ పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.