నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలో గురువారం ఖడ్గం యూత్ నామకరణకు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇకముందు కూడా తమ యూత్ నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సభ్యులు తెలిపారు. యూత్ సభ్యులు శివారెడ్డి, జగదీష్ గౌడ్, జగదీష్, ఇతరులు ఉన్నారు.