మున్సిపల్ ఆఫీస్ లో త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన చైర్మన్

69చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం చైర్మన్ పావని మల్లికార్జున్ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో కమిషనర్ భోగేశ్వరరావ్, కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్