అసెంబ్లీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను క్యాబినెట్ ఆమోదం తెలపడంతో బుధవారం మక్తల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాణసంచా పేల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీసీ కులగణన బిల్లు బలపరిచేందుకు అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీహరికి అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడు రవికుమార్, నాయకులు పాల్గొన్నారు.