మక్తల్ మండలం వనాయ్ కుంట గ్రామంలో నూతన రేషన్ దుకాణాన్ని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు బియ్యం అందజేశారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని రేషన్ డీలర్ కు చెప్పారు. గ్రామంలో నూతన రేషన్ దుకాణం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు