డిల్లి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల మక్తల్ మండలం మంతన్ గోడ్ గ్రామంలోని కూడలిలో శనివారం సాయంత్రం బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. డిల్లి అసెంబ్లీపై బీజేపీ జండా ఎగరడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు కమలం వికసిస్తున్నదని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.