ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలో జరిగే జాతీయ నాస్తిక మేళాను విజయవంతం చేయాలని భారత నాస్తిక సమాజం రాష్ట్ర కమిటీ సభ్యులు పోలప్ప అన్నారు. మేళాకు సంబంధించిన కర పత్రాలను మంగళవారం మక్తల్ అంబేద్కర్ కూడలిలో విడుదల చేశారు. ఈనెల 8, 9న రెండు రోజుల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర దేశాలు అభివృద్ధి చేందుతుంటే మన దేశంలో ఇంకా మూడ నమ్మకాలు నమ్ముతున్నారని పోలప్ప చెప్పారు.