మక్తల్ మండలం ముస్లాయిపల్లి గ్రామ మాజీ సర్పంచు గోవింద్ మృతి చెందారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శనివారం పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేశారు. సర్పంచ్ గా గోవింద్ గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.