మక్తల్: మన నుండి పదవులకు వన్నె రావాలి
పదవులతో మనకు వన్నె రావడం కాదని, మన నుండి పదవులకు వన్నె రావాలని అభ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మక్తల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రాధ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్ కుమార్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొన్నారు.