మక్తల్: చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే

63చూసినవారు
మక్తల్ మండలం సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ లో గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గంగమ్మకు పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్